Share News

MINISTER KESAV ; రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియమించండి

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:05 AM

విద్యుత శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్‌కు విద్యుత కాంట్రాక్ట్‌ కార్మికులు విన్నవించారు. వారు మంగళవా రం అనంతపురం నగరంలోని మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ... తాము విద్యుతశాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పదేళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. కావున రెగ్యులర్‌ ఉద్యోగుల కు ఇచ్చే వేతనాలను తమకు ఇవ్వాలని కోరారు.

MINISTER KESAV ; రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియమించండి
Contract workers giving petition to Minister Payyavula Keshav

ఆర్థిక మంత్రి కేశవ్‌కు విన్నవించిన విద్యుత కాంట్రాక్ట్‌ కార్మికులు

పామిడి, జూలై 30 : విద్యుత శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్‌కు విద్యుత కాంట్రాక్ట్‌ కార్మికులు విన్నవించారు. వారు మంగళవా రం అనంతపురం నగరంలోని మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ... తాము విద్యుతశాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పదేళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. కావున రెగ్యులర్‌ ఉద్యోగుల కు ఇచ్చే వేతనాలను తమకు ఇవ్వాలని కోరారు. అనంతరం వివిధ డి మాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నారాయణస్వామి, సుదర్శనబాబు, అజయ్‌కుమార్‌, నాగరాజు, దేవేంద్రనాయక్‌, ఎర్రిస్వామి, కుమార్‌స్వామి, నారాయణరావు, ఇంద్రకుమార్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 31 , 2024 | 12:05 AM