Share News

AP: ప్రశ్నార్థకంగా ఎస్‌ఎస్‌ ట్యాంకు భద్రత

ABN , Publish Date - May 16 , 2024 | 12:39 AM

మండలంలోని నింబగల్లు సమీపంలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు గట్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్ల నుంచి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.40లక్షలతో చెరువు మరమ్మతుల ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ప్రతి పాదనలకే పరిమితమయ్యాయి. సీపీడబ్య్లూఎస్‌ స్కీంకు చెందిన మూడో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు గట్లు బలహీన పడ్డాయి.

AP: ప్రశ్నార్థకంగా ఎస్‌ఎస్‌ ట్యాంకు భద్రత
Rocks blown from the embankment

ఉరవకొండ, మే 15: మండలంలోని నింబగల్లు సమీపంలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు గట్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్ల నుంచి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.40లక్షలతో చెరువు మరమ్మతుల ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ప్రతి పాదనలకే పరిమితమయ్యాయి. సీపీడబ్య్లూఎస్‌ స్కీంకు చెందిన మూడో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు గట్లు బలహీన పడ్డాయి. గట్టు పైభాగంలో మట్టి కట్ట మొత్తం నెర్రెలు చీలి 4అడుగుల లోతు మేరకు కుంగిపోయంది. దీంతో ఎప్పుడు తెగిపోతుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1997లో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును నిర్మించారు.


ట్యాంకుల భద్రతపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే కాలువ గట్టు కుంగిపోయింది. మూడేళ్ల కిందట గట్టు కుంగిపోయిన ప్రాంతం లో తాత్కలిక మరమ్మతులు చేశారు. ట్యాంకు నీటి నిల్వ సామర్థ్యం ఆరు మీటర్లు కాగా ఐదు మీటర్లకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితులు కనబడటం లేదు. చెరువులో గట్టుకు అడ్డంగా వేసిన బండలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో గట్టు భద్రత ప్రశ్నార్థకమవుతోంది. చెరువు మొత్తం పిచ్చిమొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయింది. అధికారులు స్పందించి గట్టు భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 16 , 2024 | 12:39 AM