Share News

AP silk: చేనేతకు జీఎస్టీ గుదిబండ

ABN , Publish Date - May 12 , 2024 | 11:54 PM

పట్టు వస్ర్తాలకు గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ) గుదిబండలా మారింది. వ్యాపారంలో ప్రతి రూ.100కు రూ.5 చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నారు. సంవత్సరానికి పెద్దమొత్తంలో జీఎస్టీ కడుతున్నామని వైసీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వ్యాపారులు మండిపడుతున్నారు. చేనేత వస్ర్తాలంటేనే ఖరీదుతో కూడుకున్నవి. తక్కువ లాభంతోనే వ్యాపారాలు చేస్తున్న తమకు జీఎస్టీ గుదిబండలా మారిందని వాపోతున్నారు.

AP silk: చేనేతకు జీఎస్టీ గుదిబండ

వైసీపీ పాలనలో తగ్గిన పట్టుచీరల వ్యాపారం

అనంతపురం సెంట్రల్‌, మే 12: పట్టు వస్ర్తాలకు గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ) గుదిబండలా మారింది. వ్యాపారంలో ప్రతి రూ.100కు రూ.5 చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నారు. సంవత్సరానికి పెద్దమొత్తంలో జీఎస్టీ కడుతున్నామని వైసీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వ్యాపారులు మండిపడుతున్నారు. చేనేత వస్ర్తాలంటేనే ఖరీదుతో కూడుకున్నవి. తక్కువ లాభంతోనే వ్యాపారాలు చేస్తున్న తమకు జీఎస్టీ గుదిబండలా మారిందని వాపోతున్నారు. తయారీ దారుల నుంచి కొనుగోలుచేసి రవాణా చేయడానికి తడిసిమోపెడు అవుతుంటే అదనంగా జీఎస్టీ కట్టాల్సి వస్తోందని మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎంత మొత్తం సరుకు కొన్నా.. అమ్మంకాని వాటిని తయారీదారులు వెనక్కి తీసుకునేవారు. వైసీపీ ప్రభుత్వంలో జీఎస్టీ అమలుకావడంతో తయారీదారులు వెనక్కి తీసుకోవడంలేదు. అదేవిధంగా ధరలు పెంచారు. దీంతో అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాని వ్యాపారులు అవేదన చెందుతున్నారు.

జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌కు చంద్రబాబు హామీ

ఎనడీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పట్టువస్ర్తాల వ్యాపారులకు జీఎస్టీ సొమ్మును రీయింబర్స్‌మెంట్‌ రూపంలో వెనక్కి చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. విద్యార్థులకు కళాశాలల ఫీజులు, ఆసుపత్రులకు కట్టే వైద్య ఖర్చులకు చెల్లించే రీయింబర్స్‌మెంట్‌ లాగా చేనేత వస్ర్తాల వ్యాపారులకు జీఎస్టీ మొత్తాన్ని తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - May 12 , 2024 | 11:54 PM