Share News

AP Roads: అడుగుకో గుంత.. ప్రయాణమంటే చింత!

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:49 AM

గడచిన ఐదేళ్లలో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. అడుగుకో గుంత ఏర్పడ్డాయి. వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. దీనికి ఉదాహరణే గార్లదిన్నె నుంచి మర్తాడు మీదుగా కోటంక వెళ్లే రోడ్డు. ఈ రోడ్డు సుమారు 10 కిలో మీటర్లు పొడవునా గుంతలమయమైంది. ఈ రోడ్డుపై ప్రయాణించే సమయంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.

AP Roads: అడుగుకో గుంత.. ప్రయాణమంటే చింత!
worrest road for marthadu

గార్లదిన్నె: గడచిన ఐదేళ్లలో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. అడుగుకో గుంత ఏర్పడ్డాయి. వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. దీనికి ఉదాహరణే గార్లదిన్నె నుంచి మర్తాడు మీదుగా కోటంక వెళ్లే రోడ్డు. ఈ రోడ్డు సుమారు 10 కిలో మీటర్లు పొడవునా గుంతలమయమైంది. ఈ రోడ్డుపై ప్రయాణించే సమయంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.


రాత్రి సమయంలో అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిందే. ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కోటంక గ్రామ సమీపంలోనే ఉంది. దేవాలయానికి ప్రతి ఆదివారం వందలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రతి ఏడాది మాఘమాసంలో నిర్వహించే ఉత్సవాలకు జిల్లా నుంచి కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. అయితే గుంతమయమైన రోడ్డు ప్రయాణంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారంత ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతోనే సమస్య జటిలమైందని ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 26 , 2024 | 12:49 AM