Share News

AP Politics: నల్లమాడ కనుమరుగు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:30 AM

నియోజ కవర్గాల పునర్విభజనలో కను మరుగైన నియోజకవర్గాల్లో నల్లమాడ ఒకటి. 1955లో నల్లమాడ నియోజకవర్గం ఏర్పడింది. దీని పరిధిలో తనకల్లు, నల్లచెరువు, అమడగూరు, ఓడీచెరువు, నల్లమాడ మండలాలుండేవి. 1955నుంచి 2004దాకా నల్లమాడ అసెంబ్లీ స్థానానికి 11సార్లు ఎన్నికలు జరిగాయి. 2008లో జరిగిన పునర్విభజనలో నల్లమాడ నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలు, గోరంట్ల నియోజకవర్గంలోని మూడు మండలాలను కలుపుతూ కొత్తగా పుట్టపర్తి నియోజకవర్గం ఆవిర్భవించింది.

AP Politics: నల్లమాడ కనుమరుగు
Nallamada

నియోజకవర్గాల పునర్విభజన ఫలితం

నల్లమాడ, ఏప్రిల్‌ 26: నియోజ కవర్గాల పునర్విభజనలో కను మరుగైన నియోజకవర్గాల్లో నల్లమాడ ఒకటి. 1955లో నల్లమాడ నియోజకవర్గం ఏర్పడింది. దీని పరిధిలో తనకల్లు, నల్లచెరువు, అమడగూరు, ఓడీచెరువు, నల్లమాడ మండలాలుండేవి. 1955నుంచి 2004దాకా నల్లమాడ అసెంబ్లీ స్థానానికి 11సార్లు ఎన్నికలు జరిగాయి. 2008లో జరిగిన పునర్విభజనలో నల్లమాడ నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలు, గోరంట్ల నియోజకవర్గంలోని మూడు మండలాలను కలుపుతూ కొత్తగా పుట్టపర్తి నియోజకవర్గం ఆవిర్భవించింది.


నల్లమాడ నియోజకవర్గంలో మిగిలిన మండలాలను కదిరి నియోజకవర్గంలో కలిపేశారు. ఈ నియోజకవర్గంలో 11సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు, నాలుగుసార్లు టీడీపీ అభ్యర్థులు, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రె్‌సపార్టీ నాయకుడు అగిశం వీరప్ప 1972నుంచి 1994దాకా ఆరుసార్లు పోటీచేసి మూడుసార్లు విజయం సాధించాడు. 1955నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థి బయప్పరెడ్డి, కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణరెడ్డిపై గెలుపొందారు. 1962లో కాంగ్రెస్‌ అభ్యర్థి వేమారెడ్డి, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పాపిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అగిశం వీరప గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావంతో నియోజకవర్గంలో కాంగ్రె్‌సపార్టీ పట్టు కోల్పోయింది. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కె. రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి అగిశం వీరప్పపై గెలుపొందారు. 1985లో కూడా టీడీపీ అభ్యర్థి ఎస్‌. వెంకటరెడ్డి, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థి అగిశం వీరప్పపై గెలుపొందారు.


1989లో మాత్రం మళ్లీ అగిశం వీరప్ప గెలుపొందారు. 1994లో టీడీపీ అభ్యర్థి టీడీ నాగరాజారెడ్డి గెలుపొందారు. 1999లో టీడీపీ తరపున పోటీ చేసిన పల్లె రఘునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మోహనరెడ్డిపై గెలుపొందారు. 2004లో పల్లె రఘునాథ్‌రెడ్డిపై మోహన రెడ్డి గెలుపొందారు. 2009లో ఆవిర్భవించిన పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పల్లె గెలుపొందారు. 2014లో కూడా మరోమారు గెలిచిన పల్లె చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 2019లో పల్లె రఘునాథ్‌రెడ్డిపై వైసీపీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ తరఫున పల్లె సింధూరారెడ్డి, వైసీపీ అభ్యర్థి గా శ్రీధర్‌రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో త్వరలో తేలనుంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 27 , 2024 | 12:30 AM