Share News

AP politics: ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తామంటే వద్దన్నా

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:23 AM

నేను కాలేజీ విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి దివంగత ఎనటీఆర్‌కు అభిమానిని. 1983లో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించే సమయానికే యువకుడిగా నాకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. పార్టీపెట్టిన తరువాత ఎన్టీఆర్‌ హిందూపురం నుంచి చైతన్య రథంపై ప్రచారం చేస్తూ చెన్నేకొత్తపల్లికి వచ్చారు. ఆ సమయంలో ఎంతో ఉత్సాహంతో ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికాం. ఈక్రమంలో యువకుడిగా ఉన్న నేను ఎన్టీఆర్‌ దృష్టిలో పడ్డా. పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక కోసం చేస్తున్న కసరత్తులో నా పేరు కూడా పరిశీలనకు వచ్చిందట.

AP politics: ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తామంటే వద్దన్నా
Ranga reddy

రంగారెడ్డి, రిటైర్డ్‌ హెచఎం

చెన్నేకొత్తపల్లి: నేను కాలేజీ విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి దివంగత ఎనటీఆర్‌కు అభిమానిని. 1983లో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించే సమయానికే యువకుడిగా నాకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. పార్టీపెట్టిన తరువాత ఎన్టీఆర్‌ హిందూపురం నుంచి చైతన్య రథంపై ప్రచారం చేస్తూ చెన్నేకొత్తపల్లికి వచ్చారు. ఆ సమయంలో ఎంతో ఉత్సాహంతో ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికాం. ఈక్రమంలో యువకుడిగా ఉన్న నేను ఎన్టీఆర్‌ దృష్టిలో పడ్డా. పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక కోసం చేస్తున్న కసరత్తులో నా పేరు కూడా పరిశీలనకు వచ్చిందట.


పార్టీకి చెందిన ఓ ముఖ్యనాయకు డు నా వద్దకు వచ్చి పెనుకొండ ఎమ్మెల్యే టిక్కెట్‌ మీకు ఇవ్వాలనుకుంటున్నాం. ఇస్తే పోటీలో ఉంటారా? అని అడిగారు. అప్పటి ఆర్థిక పరిస్థితుల వల్ల సాహసించలేక టిక్కెట్‌ వద్దన్నా. దీంతో రామచంద్రారెడ్డి పేరును ప్రపోజ్‌ చేస్తూ, నో అబ్జెక్షన అని సంతకం చేశా. దీంతో రామచంద్రరెడ్డికి టిక్కెట్‌ కేటాయించారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి, హెడ్‌మాస్టర్‌గా రిటైర్డ్‌ అయ్యా.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:23 AM