Share News

AP Politics: జగనన్నా.. ఇచ్చిన మాట మరిచావా ?

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:12 AM

ముఖ్యమంత్రి వైస్‌ జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ నంబులపూలకుంట మీదుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సోలార్‌ హబ్‌కు భూములో కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. రెండులక్షలు మాత్రమే ఇచ్చారు.

AP Politics: జగనన్నా.. ఇచ్చిన మాట మరిచావా ?

నంబులపూలకుంట, ఏప్రిల్‌ 27: ముఖ్యమంత్రి వైస్‌ జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ నంబులపూలకుంట మీదుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సోలార్‌ హబ్‌కు భూములో కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. రెండులక్షలు మాత్రమే ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.ఐదు లక్షలు ఇస్తామన్నారు. సాగుదారులకు కూడా రూ.లక్ష భిక్ష మిచ్చినట్లు ఇచ్చారని, పట్టాదారు పాసుపుస్తకంతో సమానంగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని గురించి మరచిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రైతులకుల నేటికి పరిహారం అందలేదని వాపోతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:12 AM