AP Police: ఖాకీలపై ఉత్తుత్తి ప్రేమ
ABN , Publish Date - May 12 , 2024 | 12:14 AM
నిత్యం పనిఒత్తిడితో సతమతమయ్యే పోలీసుల పట్ల సీఎం జగనది ఉత్తుత్తి ప్రేమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము అధికారంలోకి రాగానే పోలీసులకు అది చేస్తాం. ఇది చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసమిచ్చిన వైసీపీ నాయకులు ఏమీ చేయకుండానే ఐదేళ్లు గడిపేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలను సైతం సకాలంలో అందించకుండా మోసం చేశారని మండిపడుతున్నారు. పో

జగన పాలనలో పోలీసులకు సకాలంలో అందని రాయితీలు
పేపర్‌కే పరిమితమైన వారంతపు సెలవులు
హిందూపురం: నిత్యం పనిఒత్తిడితో సతమతమయ్యే పోలీసుల పట్ల సీఎం జగనది ఉత్తుత్తి ప్రేమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము అధికారంలోకి రాగానే పోలీసులకు అది చేస్తాం. ఇది చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసమిచ్చిన వైసీపీ నాయకులు ఏమీ చేయకుండానే ఐదేళ్లు గడిపేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలను సైతం సకాలంలో అందించకుండా మోసం చేశారని మండిపడుతున్నారు. పోలీసులకు అందాల్సిన జీపీఎఫ్, సెరెండర్ సెలవులు, అరియర్స్ సకాలంలో అందక ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం పోలింగ్ సమీపిస్తున్న వేళ పోలీసులను తమవైపు తిప్పుకునేలా గట్టి ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ఇవ్వని సెరెండర్ సెలవుల సొమ్మును గతవారం బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. దీనిద్వారా పోలీసుల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులకు ఉల్లాసం, ఉత్సాహం కరువైంది.
గతంలో యోగ, మానసిక ప్రశాంతతకు శిక్షణా తరగతులు నిర్వహించే వారు. ప్రస్తుతం అవన్నీ ఏవీ అమలు కావడం లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల సందర్భంగా పోలీసులకు వారంతపు సెలవులు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకూ నెరవేరలేదు. సెలవులు లేకపోవడంతో పోలీసులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
గాలిలో దీపంలా పోలీసుల ఆరోగ్యం
టీడీపీ పాలనలో పోలీసుల ఆరోగ్య భద్రతపై ప్రధాన దృష్టిపెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పక్షపాతిగా వ్యవహరించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీ్‌సశాఖ సంక్షేమా నికి రూ.15కోట్లు కేటాయించారు. ఏడాదికి రెండుసార్లు ముందస్తుగా మెగా ఆరోగ్య పరీక్షలు చేయించారు. నిపుణులైన వైద్యులతో జిల్లా పోలీస్ కార్యాల యం వద్దే పెద్త ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించారు. ముందస్తుగానే వ్యాధి తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా వైద్య పరీక్షలు అందించారు. పోలీసులతోపాటు వారి కుటుంబాలకు పరీక్షలు నిర్వహిం చారు. కానీ వైసీపీ పాలనలో ఇవేవీ అమలు కాలేదు. దీంతో వారి ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...