Share News

AP Housing: చేతకాక.. చెక్కులిచ్చేశారు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:35 AM

పేదలకు సొంతింటి కల నెరవేర్చలేమని జగనన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో లబ్ధిదారులతో అదనంగా కట్టించుకున్న డబ్బులకు సంబంధించిన చెక్కులను శుక్రవారం 23మందికి అందజేసింది.

AP Housing: చేతకాక.. చెక్కులిచ్చేశారు
A check returned to a beneficiary

యాడికి, ఏప్రిల్‌ 26: పేదలకు సొంతింటి కల నెరవేర్చలేమని జగనన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో లబ్ధిదారులతో అదనంగా కట్టించుకున్న డబ్బులకు సంబంధించిన చెక్కులను శుక్రవారం 23మందికి అందజేసింది. సొంతింటి కల చెదరడంతో లబ్ధిదారులు ప్రభుత్వం, అధికారులకు శాపనార్థాలు పెడుతూ తమ డబ్బులకు సంబంధించిన చెక్కులను తీసుకువెళ్లారు. కొందరు లబ్ధిదారులు మాట్లాడుతూ ఏడాది కిందట తామే ఇల్లు కట్టిస్తామని రూ.35వేలు అదనంగా డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం చెప్పడంతో వడ్డీకి అప్పులు తెచ్చి డబ్బులు కట్టామన్నారు. ఇప్పుడేమో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయలేక మమ్మల్ని ఇబ్బందులపాలు చేశారన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు, అప్పు తెచ్చిన డబ్బులకు మాత్రం వడ్డీ పెరిగింది. ఈ ప్రభుత్వానికి మా ఉసురు తగలక తప్పదు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామంటూ హౌసింగ్‌ కార్యాలయం వద్ద నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Apr 27 , 2024 | 12:35 AM