Share News

AP electricity: విద్యుత్ చార్జీల మోత..!

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:42 AM

ముఖ్యమంత్రి జగనరెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత చార్జీలు పెంచబోమని జగనరెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎడాపెడా విద్యుత చార్జీలు పెంచేశారు. ఒక్కసారి రెండు సార్లు కాదు..

AP electricity: విద్యుత్ చార్జీల మోత..!

అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌ 25: ముఖ్యమంత్రి జగనరెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత చార్జీలు పెంచబోమని జగనరెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎడాపెడా విద్యుత చార్జీలు పెంచేశారు. ఒక్కసారి రెండు సార్లు కాదు..ఐదేళ్లలో వివిధ పేర్లలో జనం నెత్తిన విద్యుత చార్జీల మోత మోగిస్తూనే ఉన్నారు. ప్రతి నెలా విద్యుత బిల్లులు పరిశీలిస్తే బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వినియోగించిన కరెంటుకు బిల్లుకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత బిల్లులు మోయలేని భారంగా మారాయి.

కొత్తకొత్త పేర్లతో చార్జీల బాదుడు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త..కొత్త పేర్లతో జనంపై విద్యుత చార్జీల మోత మోగించింది. మొదట్లో ఉన్న స్లాబులు మార్చి విద్యుత చార్జీలను పెంచింది.


తరువాత ట్రూఅప్‌ చార్జీల పేరిట 2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో వినియోగించిన విద్యుతకు చార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టింది. తరువాత ఇందన సర్దుబాబు చార్జీల పేరిట మరోసారి జనం నుంచి దండుకోవడం ప్రారంభించారు. అదనపులోడు మాటునా ముక్కు పిండి వసూలు చేశారు. ఇలా వినియోగదారుల నుంచి వివిధ పేర్లతో విద్యుత చార్జీలు వసూలు చేస్తున్నారు. వాటితోపాటు పిక్స్‌డ్‌ చార్జీల పేరిట రూ.10, కస్టమర్‌ చార్జీల పేరిట రూ.45, ఎలకి్ట్రసిటీ చార్జీల పేరుతో రూ.5.65, ఎఫ్‌పీపీసీ చార్జీల పేరుతో దాదాపురూ.35నుంచి రూ.40 ప్రతి నెలా వసూలు చేస్తున్నారు. అదే విధంగా సర్‌చార్జీల పేరిట రూ.25 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతినెలా రూ.150 అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా బిల్లులు చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 26 , 2024 | 07:54 AM