Share News

AP Elections: సోమవారం మీ కత చెబుతాం

ABN , Publish Date - May 12 , 2024 | 12:17 AM

సార్వత్రిక ఎన్నికలవేళ వీధివీధిన డబ్బుల గొడవలు నెలకొంటున్నాయి. వైసీపీ నాయకులు ఓట్లు కొనుగోలుకు డబ్బులు పంచడంతో డబ్బలందనివారు దూషణలకు దిగుతున్నారు. ప్రాంతాల వారిగా ఓటర్ల సంఖ్య లెక్కగట్టి ఒక్కో ఓటుకు రూ.2వేల చొప్పున పంచుతున్నారు. ఈ క్రమంలో వీధిలోని కొంతమందికి ఇచ్చి మరికొంతమందికి ఇవ్వకపోవడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మాకెందుకు ఇవ్వలేదని వైసీపీ నాయకులను నిలదీస్తున్నారు.

AP Elections:  సోమవారం మీ కత చెబుతాం

అనంతపురం సెంట్రల్‌, మే 11: సార్వత్రిక ఎన్నికలవేళ వీధివీధిన డబ్బుల గొడవలు నెలకొంటున్నాయి. వైసీపీ నాయకులు ఓట్లు కొనుగోలుకు డబ్బులు పంచడంతో డబ్బలందనివారు దూషణలకు దిగుతున్నారు. ప్రాంతాల వారిగా ఓటర్ల సంఖ్య లెక్కగట్టి ఒక్కో ఓటుకు రూ.2వేల చొప్పున పంచుతున్నారు. ఈ క్రమంలో వీధిలోని కొంతమందికి ఇచ్చి మరికొంతమందికి ఇవ్వకపోవడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మాకెందుకు ఇవ్వలేదని వైసీపీ నాయకులను నిలదీస్తున్నారు. వాళ్లే ఓటర్లా? మేము కనడబడలేదా అని ప్రశ్నిస్తుండటంతో డబ్బులివ్వడానికి వచ్చినవారు అక్కడి నుంచి జారుకుంటున్నారు. మీ నాయకుడు ఎలా గెలుస్తారో మేముకూడా సోమవారం చెబుతామని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భలే వ్యాపారం

ఎన్నికల పోటీలో నిలబడిన అభ్యర్థులు కొంతమంది నాయకులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మా ప్రాంతంలో ఇంతమంది ఓటర్లున్నారు. ఇంతమొత్తం అవుతుందని సొమ్ము తీసుకువచ్చిన నాయకులు కొంతమంది ఓటర్లకే పంచి, మిగిలి సొమ్మును జేబులోకి వేసుకుంటున్నారు. పైకి మాత్రం అందరికీ పంచినట్లు అభ్యర్థులకు లెక్కలు చూపుతున్నారు. ఎన్నికల్లో నాయకులుగా చెప్పుకుని పంపిణీ పేరుతో భలే వ్యాపారం చేసుకుంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 12 , 2024 | 12:17 AM