Share News

AP Elections: మరో వెయ్యి పంపిణీకి సన్నాహాలు

ABN , Publish Date - May 12 , 2024 | 12:04 AM

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి భయం పట్టిపీడిస్తోంది. ఎలాగైనా గెలవాలని, ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం ఓటుకు రూ. 2 వేలు చొప్పున ప్రతి గ్రామంలోను దాదాపు పంపిణీ పూర్తిచేశారు. మిగిలిన కొంతమందికి కూడా పంపిణీ చేస్తే విజయం మనకే వరిస్తుందన్న ధీమాతో మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం భావిస్తోంది. అదనంగా మరో రూ. వెయ్యి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

AP Elections: మరో వెయ్యి పంపిణీకి సన్నాహాలు

కళ్యాణదుర్గం వైసీపీకి ఓటమి భయం

ఇప్పటికే రూ. 2 వేలు పంపిణీ

రంగంలోకి మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు

కళ్యాణదుర్గం, మే 11: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి భయం పట్టిపీడిస్తోంది. ఎలాగైనా గెలవాలని, ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం ఓటుకు రూ. 2 వేలు చొప్పున ప్రతి గ్రామంలోను దాదాపు పంపిణీ పూర్తిచేశారు. మిగిలిన కొంతమందికి కూడా పంపిణీ చేస్తే విజయం మనకే వరిస్తుందన్న ధీమాతో మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం భావిస్తోంది. అదనంగా మరో రూ. వెయ్యి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రతి గ్రామంలోను ప్రధాన నాయకుడిని, వలంటీర్లను వెంటబెట్టుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల ముఖ్య నాయకులతో అదనంగా మరో రూ. వెయ్యి ఇస్తే ఎలా వుంటుందని చర్చలు సాగినట్లు తెలిసింది.


ఆ లెక్కన ఒక్కో మండలానికి ఎంత నగదు పంపిణీ చేయాల్సి వస్తుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. ఆదివారం ఒక్క రోజు మాత్రమే వుండటంతో వైసీపీ అసమ్మతి వాదులను బుజ్జగించి నోట్లతో ఎరవేయడమే ప్రధానంగా ముందడుగు వేస్తున్నారు. దాంతో పాటు టీడీపీ అసమ్మతి వాదులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎలాగైనా బేరం చేసి వైసీపీ వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో వున్నారు. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా అర్దరాత్రి 12 దాటినా ఎన్నికల వాతావరణంతో వాహనాల రద్దీ కనిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర వర్గం బలహీనంగా వున్న మండలం వైపే ప్రధాన దృష్టి సారించారు. ఇప్పటికే వారి వద్ద ఓ జాబితా వుంచుకుని దాని ఆధారంగా ఫోన్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మంతనాలు సాగిస్తున్నారు. ఈ డబ్బు చాలకపోతే అదనంగా మందు బాటిళ్లు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏదిఏమైనా కళ్యాణదుర్గం వైసీపీ ప్రలోభాల పర్వం జోరందుకున్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - May 12 , 2024 | 12:04 AM