AP Elections: కూపనలు ఇచ్చారు సరే.. డబ్బులు ఏవీ..?
ABN , Publish Date - May 12 , 2024 | 11:56 PM
మంత్రి ఉషశ్రీ చరణ్ ఫొటోతో ఉన్న కూపనలు ఇచ్చారు సరే మరి డబ్బులేవీ అని పలువురు ముస్లింలు మండిపడ్డారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో మంత్రి ఫొటోతో ఉన్న కూపనలను ఇంటింటికి పంపిణీ చేశారు. కూపన ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 1500 చొప్పున ఇస్తామని నమ్మబలికారు. అయితే డబ్బులు ఇవ్వకపోవ డంతో ఆదివారం కూపనలతో మంత్రి ఇంటి వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. ఎంత సేపటికి ఎవరూ స్పందించకపోవడంతో వైసీపీ తీరుపై ఆగ్రహించారు.

మంత్రి ఉష శ్రీచరణ్ ఇంటి వద్ద ముస్లిం కుటుంబాల నిరీక్షణ
పెనుకొండ టౌన, మే 12: మంత్రి ఉషశ్రీ చరణ్ ఫొటోతో ఉన్న కూపనలు ఇచ్చారు సరే మరి డబ్బులేవీ అని పలువురు ముస్లింలు మండిపడ్డారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో మంత్రి ఫొటోతో ఉన్న కూపనలను ఇంటింటికి పంపిణీ చేశారు. కూపన ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 1500 చొప్పున ఇస్తామని నమ్మబలికారు. అయితే డబ్బులు ఇవ్వకపోవ డంతో ఆదివారం కూపనలతో మంత్రి ఇంటి వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. ఎంత సేపటికి ఎవరూ స్పందించకపోవడంతో వైసీపీ తీరుపై ఆగ్రహించారు. అయితే అక్కడే ఉన్న వైసీపీ నాయకులు మంత్రి ఇంటి లైట్లు ఆపివేశారు. దీంతో వారు బండబూతులు తిట్టుకుంటూ వెనుతిరిగి వెళ్లారు. పెనుకొండ దర్గా వెనుక భాగంలో ఉన్న ముస్లిం కుటుంబాలకు నాలుగు రోజుల కిందట వలంటీర్ల ద్వారా కూపనలు అందించి, తొందర్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. సోమవారం ఓటింగ్ కూడా జరుగనుంది. అయినా ఇంత వరకు తమ ప్రాంతానికి ఎవరూ రాకపోవడంతో తామే ఇక్కడకి వచ్చినట్లు వారు తెలిపారు. కూపనలు ఇవ్వడమెందుకు, మోసం చేయడమెందుకు అంటూ మండిపడ్డారు. సోమందేపల్లి, పెనుకొండ మండలాల్లో కూపనలు అందించిన వారికి డబ్బు ఇవ్వలేక సెల్‌ఫోన స్విచ ఆఫ్ చేసుకున్నారట. దీంతో ఆగ్రహించిన ఓటర్లు ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని ఆగ్రహించారు.