Share News

ఏ సమస్యయినా 24 గంటల్లో పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:47 PM

ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు సమస్యపై వచ్చిన ఫిర్యాదును 24 గంటలో పరిష్కరించాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు.

ఏ సమస్యయినా 24 గంటల్లో పరిష్కరించాలి: కలెక్టర్‌
జేఎనటీయూలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 8: ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు సమస్యపై వచ్చిన ఫిర్యాదును 24 గంటలో పరిష్కరించాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా సీజర్స్‌ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నోడల్‌ అధికారులు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఓలకు జిల్లా అధికారులు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. జిల్లా స్థాయిలో జడ్సీ సీఈఓ, నగరపాలక కమిషనర్‌, డీఆర్‌ఓ అందుబాటులో ఉంటారని, వారి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు.

జేఎనటీయూలో ఏర్పాట్ల పరిశీలన: జేఎనటీయులో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ కేంద్రాలు, ఈవీఎంలు భద్రపరిచే సా్ట్రంగ్‌ రూమ్స్‌లను కలెక్టరు పరిశీలించారు. ఏఏ నియోజకవర్గం ఎక్కడ చేపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రతిచోట విద్యుత వసతి, సీసీ కెమెరాలు నిఘా పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:47 PM