Share News

లక్ష్మిగణపతి దేవాలయ వార్షికోత్సవం

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:39 AM

ప్రకాష్‌రోడ్డులోని లక్ష్మిగణపతి మందిర తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు.

లక్ష్మిగణపతి దేవాలయ వార్షికోత్సవం
Lakshmi Ganapati along with Hanuman

అనంతపురం కల్చరల్‌, ఏప్రి ల్‌ 23 : ప్రకాష్‌రోడ్డులోని లక్ష్మిగణపతి మందిర తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివార్ల మూలవిరాఠ్‌లకు నిర్మాల్య విస ర్జన గావించి, పంచామృ తాభిషే కాలు, వెండికవచాలంకరణలు, విశేష పూజాకార్యక్రమాలు నిర్వ హించారు. గణనాథునికి కుడుముల మాలలు, ఆంజనేయస్వామికి వడమాలలు సమర్పిం చారు.


అనంతరం ఆలయ ఆవరణంలో భక్తులు సామూహిక సత్య నారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. స్వామివారికి మహామంగళహారతి నివేదన అనంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహ కులు మణికంఠబాబు, సుబ్బారావు, శ్రీనివాసప్రసాద్‌ పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 24 , 2024 | 12:39 AM