Share News

divotional అన్నపూర్ణేశ్వరీ.. పాహిమాం..

ABN , Publish Date - Oct 06 , 2024 | 12:50 AM

దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని మూడోరోజైన శని వారం గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని పట్టణాలు, మండలకేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో గల అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు.

divotional అన్నపూర్ణేశ్వరీ.. పాహిమాం..
గుత్తి మండలం సేవాఘడ్‌లో అన్నపూర్ణేశ్వరి అలంకరణలో మాతాజగదాంబ

-శరన్నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు అన్నపూర్ణేశ్వరిగా అమ్మవార్ల దర్శనం

- ఆలయాల్లో ప్రత్యేక పూజలు - పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని మూడోరోజైన శని వారం గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని పట్టణాలు, మండలకేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో గల అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా వేకువజామునే అర్చకులు అమ్మవార్ల మూలవిరాట్‌లకు పలు అభిషేకాలు చేసి పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చనలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. సాయంత్రంవేళ లలితా సహస్ర పారాయణం గావించారు. అధిక ఆలయాల్లో అమ్మవార్లు అన్నపూర్ణేశ్వరి అలంకరణలో పూజలందుకున్నారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు పొందారు.


మరిన్ని అనంతపురం వార్తలు..

Updated Date - Oct 06 , 2024 | 12:50 AM