Share News

FESTIVALS : నేటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - May 31 , 2024 | 12:19 AM

మండలంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయస్వామి బ్రహ్మోత్స వాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు దేవదాయశాఖ ఈఓ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారి ఆలయంలో ద్వారారాధన, అంకు రార్పణ, కుంభారాధన, హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

FESTIVALS : నేటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
Chandakacharla Anjaneyaswamy Mulavirat

మడకశిర రూరల్‌, మే 30 : మండలంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయస్వామి బ్రహ్మోత్స వాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు దేవదాయశాఖ ఈఓ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారి ఆలయంలో ద్వారారాధన, అంకు రార్పణ, కుంభారాధన, హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు సీతారామ కల్యాణో త్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో శనివా రం ఉదయం మూల విరాట్‌కు పంచామృతాభిషేకం అనంతరం హోమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి స్వామి వారికి సాయంత్రం వరకు జ్యో తుల ఉత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి రథోత్సం నిర్వహిస్తామని తెలిపారు. అందుకు కావలసిన ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ వివరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 31 , 2024 | 12:19 AM