Share News

former dharna: ఆగ్రహించిన అన్నదాత

ABN , Publish Date - May 08 , 2024 | 12:57 AM

భూములకు 1బీ జారీలో జాప్యంపై అన్నదాతలు ఆగ్రహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. సీసీఐ రైతు సంఘం నాయకుడు కాటమయ్య మాట్లాడుతూ.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి యంత్రాంగం రీసర్వే ఇష్టారాజ్యంగా చేసిందని మండిపడ్డారు.

former dharna: ఆగ్రహించిన అన్నదాత
ఆందోళన చేస్తున్న రైతులు

బత్తలపల్లి, మే 7: భూములకు 1బీ జారీలో జాప్యంపై అన్నదాతలు ఆగ్రహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. సీసీఐ రైతు సంఘం నాయకుడు కాటమయ్య మాట్లాడుతూ.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి యంత్రాంగం రీసర్వే ఇష్టారాజ్యంగా చేసిందని మండిపడ్డారు. ఫలితంగా రైతులు తమ భూములను కోల్పోవాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లోపభూయిష్టంగా ఉన్న రీసర్వేతో సంబంధంలేకుండా 1బీలు తొందరగా మంజూరు చేయాలని అయన డిమాండ్‌ చేశారు.


పంట రుణాల రెన్యూవల్‌కు గడువు వచ్చిందనీ, ఇటువంటి పరిస్థితిలో 1బీ జారీ చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. వెంటనే 1బీ జారీ చేసి, రైతుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని, ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ధర్నాలు చేయడానికి వీలులేదనీ, తహసీల్దార్‌ ఎన్నికల విధుల్లో ఉన్నారన్నారు. ఎన్నికల తరువాత తహసీల్దార్‌ను కలిసి, సమస్య పరిష్కరించుకోవాలని చెప్పడంతో రైతులు వెనుదిరిగారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - May 08 , 2024 | 12:57 AM