Share News

బడుగులకు అండ.. పరిటాల

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:40 PM

పరిటాల కుటుంబం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి.. అనేక మందిని ఉన్నత స్థాయికి చేర్చిందని టీడీపీ మండల నాయకులు అన్నారు.

బడుగులకు అండ.. పరిటాల
మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

ఆత్మకూరు, ఫిబ్రవరి 7: పరిటాల కుటుంబం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి.. అనేక మందిని ఉన్నత స్థాయికి చేర్చిందని టీడీపీ మండల నాయకులు అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. తోపుదుర్తి కుటుంబం బడుగు బలహీన వర్గాల ప్రజలను అణగదొక్కడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా పరిషత మాజీ చైర్మన చమన సాబ్‌ మృతికి కారణం పరిటాల కుటుంబమే అని ఎన్నికల ముందు తప్పుడు ప్రచారం చేసిన ఆ తోపు సోదరులు.. అధికారం లోకి రాగానే దాని గురించి మాట్లాడటం లేదని, దమ్ముంటే విచారణ జరిపించి రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. అనేక మంది బీసీలను ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా చేసిన ఘనత పరిటాల కుటుంబానికే దక్కుతుందన్నారు. తోపు సోదరులు చైర్మన బోయ గిరిజమ్మతో రూ. ఆరు కోట్లు వసూలు చేశారని.. ఆత్మకూరు ఎంపీపీగా హేమలతను చేసినందుకు రూ. 50 లక్షలు తీసుకున్నా రని.. ఆలమూరు సుబ్బారెడ్డిని అడ్డుపెట్టుకొని బోయ కులస్థులను బెదిరించి 100 ఎకరాలు దౌర్జన్యంగా తీసుకున్నారని ఆరోపించారు. తోపుదుర్తి చెరువులో 40 ఎకరాలు తోపుదుర్తి అన్నదమ్ములు పేరు మీద 1బి చేసుకున్నారని, బెంగుళూరు వాళ్లను బెదిరించి మామిళ్లపల్లి దగ్గర 80 ఎకరాలు లాక్కున్నారని, పాల డెయిరీ పేరుతో రూ. కోట్లు దోచుకున్నారని, గ్రామాల్లో పాలసేకరణ చేసి వారికి బిల్లులు ఇవ్వకుండా రూ. లక్షలు దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రూ. 805 కోట్లతో పరిటాల రవీంద్ర కాలువకు నిధులు మంజూరు చేయిస్తే.. దాన్ని పూర్తి చేకుండా ఎందుకు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ శ్రీనివాసులు, మాజి కన్వీనర్‌ మనోరంజన, మండల నాయకులు కందుల ఓబులపతి, వెంకటేసులు, పూల ఓబులపతి, రామదాసు, అక్కులప్ప, నరసింహులు, బొమ్మయ్య, నరసింహారెడ్డి, శ్రీనివాసులు, హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:40 PM