Share News

deo ప్రాచీన కళలను ప్రోత్సహించాలి: డీఈఓ

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:16 AM

భారతీయ ప్రాచీన కళలను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలని డీఈఓ మీనాక్షి సూచించారు. పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం శ్రీలలిత నాట్యకళానికేతన ఆధ్వర్యంలో నాట్య వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది.

deo ప్రాచీన కళలను ప్రోత్సహించాలి: డీఈఓ
కళాకారులకు సర్టిఫికెట్లను అందజేస్తున్న డీఈఓ మీనాక్షి

ధర్మవరం, జూన 9: భారతీయ ప్రాచీన కళలను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలని డీఈఓ మీనాక్షి సూచించారు. పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం శ్రీలలిత నాట్యకళానికేతన ఆధ్వర్యంలో నాట్య వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది.


ముఖ్యఅతిధులుగా డీఈఓతోపాటు అనంతపురం లలిత కళాపరిషత చైర్మన పద్మజ, ఆంధ్రప్రదేశ సకల కళావృత్తి సంఘం అధ్యక్షుడు ఆనంద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... తల్లిదండ్రులకు పిల్లలకు చదువుతోపాటు భారతీయ ప్రాచీన కళలలను నేర్పించాలన్నారు. మన సాంప్రదాయమైన కళలను నేర్చుకున్నప్పుడే ఉన్నతమైన స్థానం లభిస్తుందన్నారు. ఇప్పటికే ప్రపంచ స్థాయిలో మన భారతీయ కళలకు ఎంతగానో గుర్తింపు ఉందన్నారు. అనంతరం ముఖ్యఅతిఽథుల చేతుల మీదుగా 50 మంది నాట్య కళాకారులకు సర్టిఫికెట్లు, మెడళ్లు అందజేశారు. కార్యక్రమంలో లలితా నాట్యనికేతన గురువులు బాబూబాలాజీ, కమలాబాలాజీ, రామలాలిత్య పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 10 , 2024 | 12:16 AM