Share News

సరిహద్దుల్లో కొనసాగుతున్న సర్వే

ABN , Publish Date - May 31 , 2024 | 11:50 PM

ఏపీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇనుప గనుల వద్ద శుక్రవారం రెండో రోజు సర్వే కొనసాగింది. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం సిద్ధాపురం, మలపనగుడి గ్రామాల సమీపంలో ఉన్న కొండల్లో కేంద్ర బృందం సర్వే నిర్వహించింది.

సరిహద్దుల్లో కొనసాగుతున్న సర్వే

రాయదుర్గం, మే 31: ఏపీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇనుప గనుల వద్ద శుక్రవారం రెండో రోజు సర్వే కొనసాగింది. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం సిద్ధాపురం, మలపనగుడి గ్రామాల సమీపంలో ఉన్న కొండల్లో కేంద్ర బృందం సర్వే నిర్వహించింది. కర్ణాటకలోని ఏడు గనుల లీజు గడుపు పూర్తి కావడంతో రెన్యువల్‌ చేయడం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. రెండు రాషా్ట్రల మధ్య సరిహద్దు వివాదం ఉండటంతో ఖచ్చితమైన సరిహద్దులను గుర్తించేందుకు అధికారులు రెండురోజులుగా కసరత్తు చేస్తున్నారు. గనుల యజమానుల వద్ద ఉన్న లీజు రికార్డులు, ప్రభుత్వం వద్ద ఉన్న లీజు సరిహద్దు రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. రెండు రాషా్ట్రల మైనింగ్‌, అటవి, రెవెన్యూ శాఖల అధికారులు, భూరికార్డుల అధికారులు సర్వేలో పాల్గొంటున్నారు. విఠలాపురం, టుముటి గ్రామాల చిత్రపటాలు, ఆ గ్రామాలకు ఆనుకుని ఉన్న సిద్దాపురం, మలపనగుడి గ్రామాల చిత్రపటాలను పరిశీలించి.. క్షేత్రస్థాయిలో కొలతలు తీస్తున్నారు. గనుల యజమానులకు లీజు సమయంలో కేటాయించిన సరిహద్దులను గుర్తించి, అనంతరం గ్రామాల సరిహద్దులను నిర్ధారిస్తున్నారు. ఇప్పటివరకు ప్రాథమికంగా గనులకు సంబంధించిన సరిహద్దులను గుర్తించినట్లు తెలిసింది. జూన ఆరో తేదీ వరకు పూర్తిస్థాయి సర్వే నిర్వహించి, కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే ప్రక్రియలో ప్రొఫెసర్‌ సూరత హర్షవర్ధన, సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రూప్లానాయక్‌, కర్ణాటక సీనియర్‌ జియాజిలిస్టు చంద్రు, సర్వేయర్‌ రవితేజ పాల్గొంటున్నారు.

Updated Date - May 31 , 2024 | 11:50 PM