ALLURI : ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:07 AM
మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఘనంగా ని ర్వహించారు. అల్లూరి చిత్రప టానికి సబ్ కలెక్టర్ అపూర్వ భరత, తహసీల్దార్ ఉదయ్ శంకర్‌రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడు తూ... ఈ దేశం నాకు ఏమిచ్చిందని కాకుండా దేశానికి నేను ఏమిచ్చాననేవిధంగా అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.

పెనుకొండ టౌన, జూలై 4: మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఘనంగా ని ర్వహించారు. అల్లూరి చిత్రప టానికి సబ్ కలెక్టర్ అపూర్వ భరత, తహసీల్దార్ ఉదయ్ శంకర్‌రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడు తూ... ఈ దేశం నాకు ఏమిచ్చిందని కాకుండా దేశానికి నేను ఏమిచ్చాననేవిధంగా అల్లూరి సీతారామరాజు
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
పెనుకొండ: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వ హించారు. బహుజన చైతన్యవేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివ రామక్రిష్ణ ఆధ్వర్యంలో పెనుకొండలో అల్లూరి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. నాయకులు వెంకటేశులు, రవికుమార్, బాబుప్రసాద్, చాలకూరు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఐసీడీఎస్ కార్యా లయంలో సీడీపీఓ శాంతలక్ష్మి, సూపర్‌వైజర్‌లు అనురాధ, సుజాతమ్మ, పుష్పలత, యర్రమ్మ, అంగనవాడీ కార్యకర్తలు అల్లూరి చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. స్థానిక పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ జయప్ప ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అధ్యాపకులు రామన్న, ప్రతాప్, యశోదరాణి, శ్రీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....