road show: కూటమి అభ్యర్థులకు నీరాజనం
ABN , Publish Date - May 12 , 2024 | 12:33 AM
సార్వత్రిక ఎ న్నికల చివరిరోజు ప్రచారంలో భాగం గా శనివారం కూట మి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సత్యకుమార్ యాదవ్, బీకే పార్థసారధి ముదిగుబ్బలో రోడ్‌షో నిర్వహించారు. కూ టమి శ్రేణులు భా రీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించా రు.

ముదిగుబ్బ, మే11: సార్వత్రిక ఎ న్నికల చివరిరోజు ప్రచారంలో భాగం గా శనివారం కూట మి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సత్యకుమార్ యాదవ్, బీకే పార్థసారధి ముదిగుబ్బలో రోడ్‌షో నిర్వహించారు. కూ టమి శ్రేణులు భా రీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించా రు.
అనంతరం బ స్టాండ్ కూడలిలో కమలా పండ్లతో ఏర్పాటు చేసిన గజమాలతో కూటమి అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీకే పార్థసారథి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ముదిగుబ్బలో ఉన్న తాగునీరు, డ్రైనేజీ , సీసీరోడ్లు, హిందూ శ్మశానవాటిక, మైనార్టీలకు ఈద్గా, ఖబరస్థాన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమిని గెలిపించాలని కోరారు. తర్వాత సత్యకుమార్ మాట్లాడుతూ తనను ఎంతగానో ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. మహిళలకు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన ప్రతిపేదకుటుంబానికి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. చిత్రావతి, జిల్లేడుబండ ముంపు రైతులకు న్యాయమైన పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ఐదేళ్లు వెనక్కు పోయిందన్నారు. జగన అరాచక పాలన సాగించారన్నారు. అభివృద్ధి పనులు ఏమాత్రం చేపట్టలేదన్నారు. ఎన్నో హామీలిచ్చా ఎక్కటీ నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారన్నారు. ఇక ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతి చెప్పక్కర్లేదన్నారు. ఆయన తిన్న అవినీతి సొమ్మునంతా త్వరలోనే కక్కిస్తానన్నారు. కూటమి శ్రేణుల జోలికొస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో ప్రతులను వారు కూటమి నాయకులతో కలిసి దహన చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల రోడ్‌షోతో ముదిగుబ్బ పట్టణం జనసంద్రమైంది.