Share News

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:57 PM

ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి జరుగనున్నాయి. దీంతో పట్టణంలోని పలు కళాశాలల్లో ఏర్పాటు చేసిన తొమ్మిది పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం
మడకశిర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రోల్‌నంబర్లు వేస్తున్న దృశ్యం

హిందూపురం అర్బన, ఫిబ్రవరి 29: ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి జరుగనున్నాయి. దీంతో పట్టణంలోని పలు కళాశాలల్లో ఏర్పాటు చేసిన తొమ్మిది పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్రాలకు కేటాయించిన విద్యార్థుల సంఖ్యను బట్టి వారి హాల్‌టికెట్‌ నెంబర్‌లను గదుల లో బల్లలపై వేసి ఉంచారు. విద్యార్థుల కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుం డా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హిందూపురంలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, నారాయణ, బాలాజీ, బాలయేసు, సువర్ణభారతి, ఎల్‌ఆర్‌జీ, ఎస్‌డీజీఎస్‌, ఏపీఆర్‌జేసీ, సప్తగిరి కళాశాలల్లోని కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

పెనుకొండ : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బషీర్‌అహ్మద్‌, సత్యసాయి కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాధర్‌ తెలిపారు. స్థానిక సత్యసాయి కళాశాలలో శుక్రవారం మొదటి సంవత్సరం జరిగే తెలుగు పరీక్షలకు 212మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. జూనియర్‌ కళాశాలలో జనరల్‌ పరీక్షలకు 143, ఒకేషనల్‌కు 161, మొత్తం 304మంది పరీక్షలకు హాజరవుతారన్నారు. ఉదయం 9నుంచి 12వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు 8.30కు పరీక్ష హాలుకు హాజరు కావాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బల్లలు, ఫ్యానలు, విద్యుత దీపాలు, మంచినీటి సౌకర్యం, ఫస్టైయిడ్‌, ప్రథమ చికిత్స శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మడకశిరటౌన: పట్టణంలో ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో మడకశిరలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గం వ్యాప్తంగా 2133 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 1702 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మడకశిర ప్రభుత్వ జూనియర్‌ కళా శాల, ఒకేషనల్‌ కళాశాల, సర్వోదయ కళాశాల, వెంకటేశ్వర జూనియర్‌ కళా శాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం 473 మంది, ద్వితీయ సంవతరం 306 మంది, ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం 316 మంది, ద్వితీయ సం వత్సరం 271 మంది పరీక్షలకు హాజరుకా నున్నారు. వెంకటేశ్వర జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం 282 మంది, ద్వితీయ సంవత్సరంలో 192 మంది, సర్వోదయ కళా శాలలో మొదటి సంవ త్సరం 434 మంది, ద్వితీయ సంవత్సరం 301 మంది విద్యార్థులు పరీక్షలు రాయను న్నా రు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 11:57 PM