hostels వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:02 AM
వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని గుత్తి సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. కాశీ విశ్వనాథ్ చారి తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం ఆయన పట్టణంలోని బాలుర ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేశారు.
పామిడి/ గుత్తి/ పెద్దవడుగూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని గుత్తి సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. కాశీ విశ్వనాథ్ చారి తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం ఆయన పట్టణంలోని బాలుర ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అక్కడి వంటగది, వసతి గదులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. హాస్టల్లో ఎం తమంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వార్డెన ఆదినారాయణను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సినవి సక్రమంగా అందుతున్నాయా...? అని ఆరా తీశారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ వీసీ గంగాధర్‌కుమార్, టైపిస్ట్ సాధిక్ వలి, పారా లీగల్ వలంటీర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయన గుత్తి పట్టణంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను రాత్రి సమయంలో తనిఖీ చేసి అక్కడి సమస్యలపై హాస్ట ల్ వార్డెనను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కు అన్ని వసతులు సమకూర్చాలని సూచించా రు. అదేవిధంగా పెద్దవడుగూరులోని బాలుర వసతి గృహాన్ని కూడా ఆయన తనిఖీ చేసి అక్కడ విద్యార్థుల వసతులను పరిశీలించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...