Share News

బైక్‌ర్యాలీతో సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:38 AM

పుట్టపర్తి, జన వరి 6: పట్టణంలో సమగ్రశిక్ష ఉద్యోగులు బైక్‌ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. సమస్యల ప రిష్కారం కోసం వా రు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 18వ రోజుకు చేరిం ది.

బైక్‌ర్యాలీతో సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన

పుట్టపర్తి, జన వరి 6: పట్టణంలో సమగ్రశిక్ష ఉద్యోగులు బైక్‌ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. సమస్యల ప రిష్కారం కోసం వా రు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 18వ రోజుకు చేరిం ది. సందర్భంగా స్థా నిక ఆర్డీవో కార్యాలయం నుంచి గణేష్‌ సర్కిల్‌వరకు బైక్‌ర్యాలీ చేశారు. అనంతరం గణేష్‌ సర్కిల్‌ చుట్టూ తిరిగారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఫెడరేషన జేఏసీ అధ్యక్షుడు ఓబుళరెడ్డి మాట్లాడుతూ సమగ్రశిక్ష ఉద్యోగులు 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నా ఉద్యోగభద్రత లేదన్నారు. విద్యాశాఖలో అన్నివిభాగాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగభద్రతోపాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. మెడికల్‌ సెలవులు, ఈఎ్‌సఐ, పీఎఫ్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లాకార్యదర్శి వెంకటేష్‌, ఉద్యోగ సంఘం నాయకులు రామన్న, రవి. నాగరాజు, ఓబులేసు, భవాని, స్రవంతి, రాజ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:38 AM