Share News

పంచాయతీ నీటితో వనం పెంపకం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:24 AM

వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు తహతహలాడుతుంటే కోగిర గ్రామానికి చెందిన పాల నరసింహులు అనే వ్యక్తి ఏకంగా పంచాయతీ నీటితో ఇంటి వద్ద వనాన్ని పెంచి పోషిస్తున్నాడు.

పంచాయతీ నీటితో వనం పెంపకం
పాలనరసింహులు పంచాయతీ నీటితో పెంచుతున్న వనం

రొద్దం, మార్చి 28 : వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు తహతహలాడుతుంటే కోగిర గ్రామానికి చెందిన పాల నరసింహులు అనే వ్యక్తి ఏకంగా పంచాయతీ నీటితో ఇంటి వద్ద వనాన్ని పెంచి పోషిస్తున్నాడు. రొద్దం మండల పరిధిలోని కోగిర గ్రామంలో కంచిస ముద్రం వెళ్లే దారికి ఎడమవైపున అతడు ని వాసం ఉంటున్నాడు. తన ఇంటివద్ద పంచా యతీ నీటితో టెంకాయ చెట్లు, అవిశ చెట్లు పెంచుతున్నాడు. అందులోనే రాగిపంటను సాగుచేశా డు. అయితే గ్రామంలో తాగునీటి స మస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... అతడు చెట్ల పెంపకానికి నీటిని తోడేస్తు న్నాడని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. ఈ విషయంపై ఎన్నో మార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోలేదని గ్రా మస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికా రులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి రమేష్‌ను వివరణ కోరగా... ఈ విషయం తన దృష్టికి రాలేదని సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:24 AM