కోడి పందేలు ఆడితే చర్యలు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:47 AM
ఓబుళదేవరచెరువు, జనవరి 11: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడిపందేలు, పేకాట ఆడితే చర్యలు తప్పవని ఎస్‌ఐ కె. మల్లికార్జునరెడ్డి హెచ్చరించారు.

ఓబుళదేవరచెరువు, జనవరి 11: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడిపందేలు, పేకాట ఆడితే చర్యలు తప్పవని ఎస్‌ఐ కె. మల్లికార్జునరెడ్డి హెచ్చరించారు. మండలంలోని నల్లగుట్లపల్లి, వీర ఓబనపల్లి గ్రామాల్లో ఆయన గురువారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో సమావేశమై మాట్లాడుతూ సంక్రాంతి పండుగ దృష్ట్యా ఎవరైనా కోడిపందేలు, పేకాట ఆడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. పండుగలకు ఊళ్ల వెళ్లే వారు విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచకుండా వెంట తీసుకెళ్లాలని, లేదా బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవాలని సూచించారు. తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.