Share News

సీపీఎస్‌ రద్దును టీడీపీ మేనిఫెస్టోలో చేర్చాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:02 AM

సీపీఎస్‌ రద్దు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టో లో చేర్చాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను యూటీఎఫ్‌ నాయకులు కోరారు. మండలంలోని కౌకుంట్లలో ఎమ్మెల్యే కేశవ్‌ను మంగళవారం యూటీఎఫ్‌ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అంద జేశారు.

సీపీఎస్‌ రద్దును టీడీపీ మేనిఫెస్టోలో చేర్చాలి

ఎమ్మెల్యేను కేశవ్‌ను కోరిన యూటీఎఫ్‌ నాయకులు

ఉరవకొండ, మార్చి 5: సీపీఎస్‌ రద్దు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టో లో చేర్చాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను యూటీఎఫ్‌ నాయకులు కోరారు. మండలంలోని కౌకుంట్లలో ఎమ్మెల్యే కేశవ్‌ను మంగళవారం యూటీఎఫ్‌ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అంద జేశారు. రాష్ట్రంలో రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన విధానం అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 11లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. వీరి లో ఐదున్నర లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా మిగిలిన వా రంతా కాంట్రా క్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల్లో 3లక్షల మంది కి 2004లో ప్రారంభమైన కాంట్రిబ్యూటరీ పెన్షన విధానం అమలు జరుగుతోందన్నారు. దీని వల్ల జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రాజస్థాన, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ, పంజాబ్‌ రాష్ర్టాలు పాత పెన్షన విధానాన్ని పునరుద్ధరించాయన్నారు. ఏపీలో కూడా ఉద్యో గులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి పెన్షన, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు రామప్ప చౌదరి, జయ రాములు, శ్రీనివాసులు, రఘు, లక్ష్మీనారాయణ, ఉమాపతి, నాగరాజు, రాము, వేణు, శ్రీధర్‌, రామచంద్ర, నరసింహులు, రవి, తిప్పన్న పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:02 AM