road accident రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:23 AM
మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలోగల హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఘటనపై ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

డీ.హీరేహాళ్, జూలై 7: మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలోగల హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఘటనపై ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
బళ్లారికి చెందిన మహబూబ్‌బాషా(22), అతని స్నేహితుడు అనిల్‌కుమార్ ఆదివారం బైక్‌పై షికారు కోసం ఓబుళాపురం గ్రామానికి వచ్చారు. కొద్దిసేపు అనంతరం తిరిగి బళ్లారికి బయలుదేరారు. ఓబుళాపురం గ్రామ సమీపంలో ఉన్న బళ్లారి - బెంగుళూరు హైవేలో మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. ప్రమాదంలో మహబూబ్‌బాషా బాషాకు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అనిల్‌కుమార్‌కు తీవ్రగాయాలవడంతో స్థానికులు 108 వాహనంలో బళ్లారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహబూబ్‌బాషా మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.