Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:54 PM

మండల పరిధిలోని యు.రంగాపురం గ్రామ సమీపం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్‌(21) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
died inaccidents

ఫ మరో ముగ్గురికి తీవ్రగాయాలు

మడకశిరటౌన, జూలై 5: మండల పరిధిలోని యు.రంగాపురం గ్రామ సమీపం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్‌(21) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు యువకులు అశోక్‌, నవీన, గణేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నంద్యాలకు చెందిన అశోక్‌, నవీన, గణేష్‌, గద్వాలకు చెందిన అనిల్‌ నలుగురూ స్నేహ కోళ్లఫారంలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. ఈనలుగురూ రెండు ద్విచక్ర వాహనాల్లో మడకశిరకు వస్తుండగా యు.రంగాపురం గ్రామ సమీపంలోకి రాగానే వెనకనుంచి వచ్చిన లారీ బైక్‌లను ఢీకొట్టి వెళ్లింది. రోడ్డుపై పడిపోయిన వారు లేస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చిన మరోలారీ వారిపై దూసుకుపోయింది. దీంతో అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందగా నవీన, అనీల్‌, గణేష్‌ తీవ్రగాయాలతో బయటపడ్డారు. వారిని 108 వాహనంలో మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఏఎ్‌సఐ బ్రహ్మానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో సంఘటన వివరాలు అడిగి నమోదు చేసుకొన్నారు. ఢీకొట్టిన లారీలను గుర్తించేందుకు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆస్పత్రి వద్దకు వెళ్లి మార్చురీలో అశోక్‌ మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి సంఘటన వివరాలను తెలుసుకొన్నారు. ప్రమాదానికి కారణమైన లారీలను గుర్తించాలని పోలీసులకు సూచించారు.

Updated Date - Jul 05 , 2024 | 11:54 PM