టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Mar 30 , 2024 | 12:28 AM
పుట్టపర్తి రూరల్,/బుక్కపట్నం మార్చి 29: మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటకనాగేపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెం దిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పుట్టపర్తి రూరల్,/బుక్కపట్నం మార్చి 29: మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటకనాగేపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెం దిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పుట్టపర్తి రూరల్‌పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుక్కపట్నం మండలం నారసింహపల్లికి చెందిన కిష్టప్ప కుమారుడు విష్ణువర్ధననాయుడు (35) కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించేవా డు. కాగా గురువారం అర్ధరాత్రి పుట్టపర్తి నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. కర్ణాటక నాగేపల్లి వద్దకు రాగానే బైక్‌ను రహదారి పనులు చేస్తున్న టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విష్ణువర్ధననాయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని స్టేషనకు తరలించామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. విష్టువర్ధననాయుడి మృతి విషయం తెలుసుకున్న మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్యాహ్నం గ్రామానికి వచ్చి మృతదేహాన్ని సందర్శించి
నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.