Share News

చైతన్యనానికి ప్రతీక

ABN , Publish Date - May 03 , 2024 | 11:46 PM

కదిరి పేరు వింటేనే గుర్తు వచ్చేది ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి. ఖాద్రీ వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మొదట ఖాద్రీగా కాలక్రమేణా కదిరిగా పేరు వచ్చింది. 1910లో కదిరి తాలూకా కడప జిల్లా నుంచి విడిపోయి అనంతపురం జిల్లాలో కలిసింది.

చైతన్యనానికి ప్రతీక
hiostory of kadiri

వ్యవసాయమే జీవనాధారం

నిత్యకరువులతో వ్యవసాయం కుదేలు

వలసబాటలో రైతులు, కూలీలు

కదిరి నియోజకవర్గ

అభివృద్ధి పట్టని పాలకులు

కదిరి, మే 3 : కదిరి పేరు వింటేనే గుర్తు వచ్చేది ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి. ఖాద్రీ వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మొదట ఖాద్రీగా కాలక్రమేణా కదిరిగా పేరు వచ్చింది. 1910లో కదిరి తాలూకా కడప జిల్లా నుంచి విడిపోయి అనంతపురం జిల్లాలో కలిసింది. రాష్ట్రంలోనే అతి పెద్ద తాలూకాగా పేరుగాంచింది. గతంలో 10మండలాలు కలసి కదిరి తాలూకాగా ఉండేది. కదిరికి కరువుకు విడదీయరాని బంధం ఉంది. అనేక సంవత్సరాలుగా కరువు కదిరి ప్రాంతంలో తిష్టవేసింది. ఉపాధికి ఎటువంటి పరిశ్రమలు లేవు. వర్షాదార పంటలే జీవనాధారం. ఇందులో వేరుశనగ ముఖ్యమైనంది. వేరుశనగ పంటకాలం పూర్తయితే ఇక్కడి రైతులందరూ కూలీలే. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని 20 ఎకరాల ఆసామి కూడా వలస వెళ్లాల్సిందే. కదిరి నుంచి బెంగళూరు నగరంలో వలస కూలీలుంటున్న హోంగసద్ర అనే ప్రాంతానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారంటే వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామితోపాటు ఇక్కడ కొన్ని పుణ్యక్షేత్రలు, దర్శనీయ స్థలాలున్నాయి. కదిరి మల్లెలలకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానముంది.


కదిరి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజవర్గాల పునర్వివిభజన తరువాత కదిరి, తలుపుల, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, నంబులపూలకుంట మండలాలను కదిరి నియోజకవర్గంగా విభజించారు. నియోజవర్గ ఓట ర్ల సంఖ్య 2,50,776. వీరి లో పురుషులు 1,23, 742, మహిళలు 1,27, 027 మంది ఉన్నారు. కదిరి మున్సిపాలిటీ ఉంది. అత్యధికంగా ఇ క్కడ మైనార్టీ ఓటర్లు ఉన్నారు. నియోజకవ ర్గం 1962లో ఎస్టీకి రిజ ర్వు అయింది. 1952 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గం లో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్‌, మూడుసార్లు టీడీపీ, రెండుసార్లు వైసీపీ, ఒక్కోసారి బీజేపీ, ఇండిపెండింట్‌ గెలిచారు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేవీ వేమారెడ్డి 5,273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జొన్నా సూర్యనారాయణ కాంగ్రెస్‌ అభ్యర్థి మహమ్మద్‌ షాకీర్‌పై 55,231 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు నియోజవర్గ చరిత్రలో ఇదే అత్యధికం. 2014 ఎన్నికల్లో అత్తార్‌ చాంద్‌బాషా తన సమీప ప్రత్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌పై 968 ఓట్లతో గెలిచారు. ఇదే అత్యల్ప మెజార్టీ.


మూఢ నమ్మకాలను తన పద్యాలతో ప్రశ్నించిన మహాకవి యోగివేమన సమాధి గాండ్లపెంట మండలం కటారుపల్లిలో ఉంది. ఇక్కడ యోగివేమన జీవ సమాధి అయినట్లు చరిత్ర చెబుతోంది. పల్నాడు జిల్లా కొండవీడు ప్రాంతం నుంచి యోగివేమన ఒం టరిగా కటారుపల్లికి వలస వచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వేమన తిరుణాల నిర్వహిస్తుంటారు.

తలుపుల మండలంలోని బట్రేపల్లికి సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో జలపాతం ఉంది. కదిరి - పులివెందుల రోడ్డుకు సమీపంలో ఎత్తయిన కొండపై నుంచి నీటి ప్రవాహం వాలు జారుతుంది. ఈ జలపాతం వర్షాకాలంలో దాదాపు మూడు నెలల పాటు పర్యాటకులకు కనువిందు చేస్తుంది.


కదిరి ప్రాంతం చైతన్యానికి మారుపేరు. కదిరి మున్సిపాలిటీలోని కుటాగుళ్ల విప్లవాల గడ్డగా పేరుంది. కుటాగుళ్ల విప్లవయోధుడు రవూఫ్‌ జన్మస్థలం. ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. కదిరి ప్రాంత సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. విద్యావంతుడైన రవూఫ్‌ ప్రజాన్యాయవాదిగా పేరొందాడు. కమ్యూనిస్టు రాజకీయాల వైపు మొగ్గు చూపిన ఆయన.. తొలుత సీపీఐలో తర్వాత సీపీఎంలో పనిచేశారు. తరువాత సీపీఎం నుంచి సీపీఐఎంఎల్‌గా విడిపోయినపుడు ఆయన కూడా ఎంఎల్‌ పార్టీలోకి వెళ్లారు. అప్పటి నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో చారుమజుందార్‌ వంటి వారితో కలిసి విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్నారు. చనిపోయేంతవరకు కమ్యూనిస్టుగా, నిస్వార్థపరుడిగా జీవితాన్ని గడిపారు.


కదిరి నియోజకవర్గం ముఖ్యంగా వ్యవసాయంపై అధారపడింది. సాగునీరు ఇక్కడ ప్రధాన సమస్య. ఎలాంటి సాగునీటి సదుపాయం లేదు. నియోజవర్గంలో దాదాపు 100 చెరువులకు పైగా ఉన్నాయి. నదులు లేక పోవడంతో వ్యవసాయమంతా భూగర్భ జలాలపైనే అధార పడి ఉంది. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీళ్లు అందిస్తామని వైసీపీ హామీలు ఇచ్చింది కానీ ఎలాంటి పనులు చేపట్టలేదు. 2019 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులు అలాగే ఉండిపోయాయి. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా కదిరి, తలుపుల, నంబులపూలకుంట మండలాలకు నీళ్లు అందాల్సి ఉంది. అదే విధంగా పుంగనూరు బ్రాంచ కెనాల్‌ ద్వారా కదిరి, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట మండలాలు నీళ్లు చేరాల్సి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలతున్నా హంద్రీనీవా పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. హంద్రీనీవా ద్వారా నీరు అందిస్తే వేలాది ఎకరాలు సస్యశ్యామలమవుతాయి.


ఫ కదిరి నియోజవర్గంలో కరువు నిత్యం ఉంటుంది. ఉపాధి కోసం అన్ని వయసుల వారు వలసలు వెళుతుంటారు. ఉపాధినిచ్చే పరిశ్రమలు ఒక్కటీ లేవు. చదువుకున్నవారు, చదువు లేని వారు బెంగళూరు, తిరుపతి, హైదరాబాదు వంటి నగరాలకు నిత్యం వలస వెళుతుంటారు.

ఫ ఈ ప్రాంతంలో వేరుశనగ, టమోట అత్యధికంగా పండిస్తారు. వీటికి గిట్టుబాటు ధర లేక ఆదర ణ కరువయింది. వేరుశనగ విస్తీర్ణం తగ్గుతోంది. వ్యవసాయాఽధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఫ పర్యాటక రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురయింది. ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తిమ్మమ్మమర్రిమాను, యోగివేమన సమాధి ఉన్న కటారుపల్లిలో, బట్రేపల్లి జలపాతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. పర్యాటక సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తే కదిరి అభివృద్ధి చెందుతుంది.

ఫ కదిరి పట్టణంలో దాదాపు 10 వేల మందికి పైగా బీడీ కార్మికులు ఉన్నారు. నిత్యం అనేక జబ్బులతో సతమతమవుతున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఈఎ్‌సఐ ఆసుపత్రి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి ఎన్నికకు ఇదే వాగ్దానంగా మిగిలిపోతోంది.

ఫ కదిరి పట్టణంలో దాదాపు 1.20 లక్షల మంది జనాభా ఉన్నారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో పాటు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటి బాగు చేయాలని ప్రజలు కోరతున్నారు. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని వైసీపీ ఇచ్చిన హామీ నేరవేరలేదు.

Updated Date - May 03 , 2024 | 11:46 PM