Health Minister Sathya Kumar ప్రభుత్వాస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని వినతి
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:43 PM
పట్టణంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ను స్థాని క బీజేపీ నాయకులు కోరారు. అనంతపురంలో ఆదివారం వారు మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

గుంతకల్లుటౌన, జూలై28: పట్టణంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ను స్థాని క బీజేపీ నాయకులు కోరారు. అనంతపురంలో ఆదివారం వారు మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్ మాట్లాడుతూ.. రోగుల పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి చిన్న విషయానికి కర్నూ లు, అనంతపురానికి రెఫర్ చేస్తున్నారని తెలిపా రు. వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న వైద్యులు, ల్యాబ్‌టెక్నిషియన్లు, నర్సు లు పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పురంధర్, బండారుకృష్ణమూర్తి, విశ్వనాథ్, మునిరాజు, సురేష్, గుర్రంసూర్యనారాయణ, జీఎం మహేష్, శ్రీదేవి పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..