Share News

స్నేహితుడి కుటుంబానికి చేయూత

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:40 PM

తనతో పాటు కలిసి చదువుకున్న చిన్నపాటి మిత్రుడు అకాల మరణంతో అతని కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచా రు.

స్నేహితుడి కుటుంబానికి చేయూత
ఆర్థికసాయం అందజేస్తున్న స్నేహితులు

చెన్నేకొత్తపల్లి, మార్చి 24: తనతో పాటు కలిసి చదువుకున్న చిన్నపాటి మిత్రుడు అకాల మరణంతో అతని కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచా రు. చెన్నేకొత్తపల్లికి చెందిన బొగ్గునరసింహులు ఏడాదిన్నరక్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో అతని కుటుంబం ఇంటిపెద్ద దిక్కును కోల్పోయింది. అతనికి భార్య మంజుల, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో 1998- 99 బ్యాచకు చెందిన పూర్వపు విద్యార్థులు గత నెల 25న సమావేశమయ్యారు. మరణించిన స్నేహితుడి కుటుంబానికి తమవంతుగా చేయూత నందించాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారంత తోచిన రీతిలో ఆర్థికసాయం అందించారు. ఆదివారం మిత్రుని కుటుంబాన్ని పరామర్శించి సేకరించిన రూ.50వేలు నగదును భార్య మంజులకు అందజేశారు. అదేవిధంగా తాము చదువుకున్న పాఠశాలకు రూ.10వేలు విలువ చేసే కుర్చీలను సమకూర్చారు.

Updated Date - Mar 24 , 2024 | 11:40 PM