Share News

రెండున్నరేళ్లుగా అభివృద్ధి జాడలేని పురం

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:35 AM

హిందూపురం మునిసిపాలిటీ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఏ 1 మునిసిపాలిటి అయిన హిందూపురానికి తెలుగుదేశం పార్టీ హయాంలో స్వచ్ఛ మునిసిపాలిటీగా అవార్డు కూడా దక్కిం ది.

రెండున్నరేళ్లుగా అభివృద్ధి జాడలేని పురం
పూడిపోయిన డ్రైనను చూపుతున్న కౌన్సిలర్‌ రోషన ఆలీ

అసహనం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు

ఇటీవల సమావేశంలో నిలదీసిన కౌన్సిలర్లు

హిందూపురం అర్బన, ఫిబ్రవరి 1: హిందూపురం మునిసిపాలిటీ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఏ 1 మునిసిపాలిటి అయిన హిందూపురానికి తెలుగుదేశం పార్టీ హయాంలో స్వచ్ఛ మునిసిపాలిటీగా అవార్డు కూడా దక్కిం ది. అలాంటి మునిసిపాలిటీలో వైసీపీ అధికారం చేపట్టాక ఒక్కటంటే ఒక్క అభివృద్ది పని కూడా జరుగలేదనే విమర్శ పట్టణంలో కోడై కూస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమ యంలో అప్పటి మునిసి పల్‌ చైర్‌ పర్సన రావిళ్ళ లక్ష్మి ఆధ్వర్యంలో పట్ట ణంలో ఎంతగానో అభి వృద్ధి జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డు లో డ్రైన్లు, రోడ్లు ఎంతో అ భివృద్ధి చెందాయని ప ట్టణ ప్రజలు అంటున్నా రు. అయితే వైసీపీ పాల నలో ప్రస్తుత చైర్‌పర్సన ఆధ్వర్యంలో అభివృద్ధా అంటే ఏమిటి అనే విధంగా పాలన సాగుతోందని వైసీపీ కౌన్సిలర్లే మాట్లాడు కోవడం విశేషం. గత నెల 28వ తేదీన మునిసిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావే శం జరిగింది. ఇందులో సాక్ష్యాత్తు వైసీపీ కౌన్సిలర్లే చైర్‌ పర్సన పోడియం వద్దకు వెళ్లి పట్టణంలో అభివృద్ధిపై ఆమెను నిలదీశారు. హిందూపురంలో 38 వార్డులున్నాయి. అన్ని వార్డులకు మీరు చైర్‌పర్సన. రెండున్నరేళ్లుగా వార్డుల్లో పనులు జరుగలేదు. ప్రజలకు మేమేమి జవాబు చెప్పా లని నిలదీశారు. పోడియం వద్ద కూర్చుని నిరసన తెలిపారు. హిందూపురం లో కొంతమంది(మగ్గురు కౌన్సిలర్లు)కి మాత్రమే కోట్ల రూపాయల పనులు అలాట్‌ చేశారని, మిగిలిన కౌన్సిలర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిచారు.

20 ఏళ్లలో ఇంత అధ్వాన పరిస్థితి చూడలేదు - రోషనఅలీ, 29వ వార్డు కౌన్సిలర్‌

నేను 20 ఏళ్ల నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుస్తూనే ఉన్నా. గతంలో నేనే నా వార్డులో అభివృద్ధి చేయడంతో ప్రజలు ప్రతిసారి నన్ను ఆదరిస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కౌన్సిలర్‌గా ఎన్నో పనులు మా వార్డులో చేపట్టాను. ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచాను. ఇప్పటి వరకు మా వార్డులో ఏ అభివృద్ధి పనులు జరుగలేదు. నిత్యం వేలాది మంది సంచరించే ఎస్‌బీఐ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి, నా వార్డు పరిధిలోకే వస్తుంది. ఇక్కడ డ్రైను పూర్తిగా మూసుకుపోయింది. దుర్వాసన వెదజ ల్లుతోంది. ముక్కు మూసుకుని అటుగా వెళ్లాల్సి వస్తోంది. ప్రధాన రహదారిలో పెద్ద గుంతలా డ్రైను ఏర్పడింది. దీంతో తరచూ ప్రమా దాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక వృద్ధుడు పొరపాటున అందులో పడి తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. స్థానికులు గుమనించి ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా ఓ కారు ఆ డ్రైనులో పడిపోయింది. ఇలా ప్రమాదాలబారిన పడి ప్రాణాలు పోకముందే డ్రైనను పూర్తి చేయాలని రెండున్నరేళ్లుగా ప్రతి కౌన్సిల్‌ సమావేశంలో చైర్‌పర్సనకు, అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాను. అయినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంత అధ్వాన పాలన నా 20 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ తారసపడలేదు.

Updated Date - Feb 02 , 2024 | 12:35 AM