Share News

రెండో రోజు 29 నామినేషన్లు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:55 AM

ఉమ్మడి జిల్లాలో రెండో రోజు మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం ఎంపీ స్థానానికి తాడిపత్రికి చెందిన పామిశెట్టి చౌడేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన దాఖలు చేశారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల పరిధిలో 28 నామినేషన్లు దాఖలయ్యాయి.

రెండో రోజు 29 నామినేషన్లు
రిటర్నింగ్‌ అధికారికి నామినేషన పత్రాలు అందజేస్తున్న జేసీ అశ్మితరెడ్డి

ఎంపీ స్థానానికి ఒకటి.. ఎమ్మెల్యేలకు 28

అనంతపురం టౌన/పుట్టపర్తి, ఏప్రిల్‌ 19: ఉమ్మడి జిల్లాలో రెండో రోజు మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం ఎంపీ స్థానానికి తాడిపత్రికి చెందిన పామిశెట్టి చౌడేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన దాఖలు చేశారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల పరిధిలో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. రాప్తాడులో 5, మడకశిర, ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు, అనంతపురం అర్బన, ఉరవకొండలో ఒక్కొక్కటి, శింగనమల, కళ్యాణదుర్గం, తాడిపత్రి, పెనుకొండ, హిందూపురంలో రెండేసి నామినేషన్లు దాఖలయ్యాయి. కదిరిలో మూడు, పుట్టపర్తిలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.

శింగనమలలో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అభ్యర్థిగా న్యాయవాది యాట వెంకట సుబ్బన్న, ఆల్‌ ఇండియా కిసాన జనతా పార్టీ అభ్యర్థిగా కప్పల నాగరాజు నామినేషన వేశారు. గుంతకల్లులో వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే వై.వెంకట రామిరెడ్డి నామినేషన దాఖలు చేశారు. రాయదుర్గంలో బీఎస్పీ తరఫున చిందనూరు నాగరాజు నామినేషన వేశారు. కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తరఫున ఆయన సోదరి రాధామాధవి నామినేషన దాఖలు చేశారు. ఉరవకొండలో కాంగ్రెస్‌ తరఫున మధుసూదన రెడ్డి నామినేషన దాఖలు చేశారు. తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి నామినేషన దాఖలు చేశారు.

Updated Date - Apr 20 , 2024 | 01:36 AM