Share News

20 కుటుంబాలు టీడీపీలోకి చేరిక

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:16 AM

ముదిగుబ్బ, ఫిబ్రవరి 5: మండలంలోని గాండ్లవారిపల్లికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశంలోకి చేరారు.

   20 కుటుంబాలు టీడీపీలోకి చేరిక

ముదిగుబ్బ, ఫిబ్రవరి 5: మండలంలోని గాండ్లవారిపల్లికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశంలోకి చేరారు. అనంతపురంలోని పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ నివాసంలో, ఆయన సమక్షంలో ఆదివారం వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీరామ్‌ వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. వచ్చే ఎన్నిల్లో టీడీపీ విజయానికి ప్రతిఒక్కరూ సైనికుల్లా పని చేయాలని సూచించారు. పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. పార్టీలోకి చేరిన వారిలో చింతప్ప, రోశన్న, నాగరాజు, నరసింహులు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ముదిగుబ్బ మండల కన్వీనర్‌ కరణం ప్రభాకర్‌, నాయకులు సూర్యశేఖరరాజు, ఆనంద్‌, త్రిలోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:16 AM