Share News

సకాలంలో స్పందించని 108 సిబ్బంది.. వృద్ధుడి మృతి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:55 PM

సకాలంలో 108 వాహనం స్పందించకపోవడం ఓ వృద్ధుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సకాలంలో స్పందించని 108 సిబ్బంది.. వృద్ధుడి మృతి
సకాలంలో 108 వాహనం స్పందించకపోవడం ఓ వృద్ధుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మడకశిర రూరల్‌ మార్చి 1: సకాలంలో 108 వాహనం స్పందించకపోవడం ఓ వృద్ధుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మండలంలో జమ్మానపల్లి గ్రామానికి చెందిన నరసింహప్ప(70)కు శుక్రవారం ఉదయం గుండెలో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వారు స్పందించిన సకాలంలో రాకపోవడంతో ఆటోలో మడకశిరకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వృద్ధుడు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని కాపాడటం కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి 108 వాహనాలను ఏర్పాటు చేస్తే అవి సకాలంలో రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఆయన బతికే వారని వాపోయారు. దీనిపై 108 వాహన డ్రైవర్‌ స్పందిస్తూ నరసింహప్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఫోన కాల్‌ వచ్చింది. వెంటనే స్పందించి 15 నిమిషాల్లో ఆగ్రామానికి వెళ్లాం. ఆయనకు గుండెపోటు రావడంతో అప్పటికే మృతిచెందాడని తెలిపారు.

నరసింహప్ప మృతికి టీడీపీకి తీరనిలోటు: టీడీపీ నాయకుడు నరసింహప్ప మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి సునీల్‌ కుమార్‌ అన్నారు. జమ్మానిపల్లిలో నరసింహప్ప శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్నా సునీల్‌ కుమార్‌ గ్రామనికి వెళ్లి భౌతిక కాయంపై పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈయన వెంట క్రిష్టప్ప, రామాంజనేయలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నరసింహప్ప మృతదేహం

Updated Date - Mar 01 , 2024 | 11:56 PM