MP AMBIKA: ఉద్యోగ భద్రత కల్పించండి
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:31 PM
వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను ఆ సంఘం నాయకులు కోరారు. సోమవారం నగర శివారులోని ఆయన నివాసంలో సంఘం రాయలసీమ జోన అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్, నాయకులు శేషు, శివశంకర్, భాస్కర్ నాయక్, గౌరి, శ్యామల ఎంపీకి వినతి పత్రం అందజేశారు.

అనంతపురం అర్బన, జూలై 8: వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను ఆ సంఘం నాయకులు కోరారు. సోమవారం నగర శివారులోని ఆయన నివాసంలో సంఘం రాయలసీమ జోన అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్, నాయకులు శేషు, శివశంకర్, భాస్కర్ నాయక్, గౌరి, శ్యామల ఎంపీకి వినతి పత్రం అందజేశారు. టీడీపీ హయాంలోనే ఎంపీఈఓలుగా తమకు ఉద్యోగ అవకాశం కల్పించారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ పాలనలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కొన్నేళ్లుగా పనిచేస్తున్న తమకు అన్యాయం జరిగిందన్నారు. 1000 హెక్టార్లకు ఒక ఎంపీఈఓను నియమించి న్యాయం జరిగేలా చూడాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఓడీపై పనిచేస్తున్న జిల్లాకు చెందిన ఎంపీఈఓలను తిరిగి అనంతలోనే పోస్టింగ్‌లు ఇప్పించాలని కోరారు. ఓడీపై వెళ్లకపోవడంతో టర్మినేట్ చేసిన వారికి తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ స్పందిస్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.