Share News

AMILINENI: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:37 PM

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళవారం శెట్టూరు మండలం చిన్నంపల్లి, బొచ్చుపల్లి, లింగదీర్లపల్లి, కైరేవు, చెర్లోపల్లి, మాలేపల్లి, ఎర్రబోరేపల్లి, కంబాలపల్లి, లక్ష్మంపల్లి గ్రామాల్లో అమిలినేని రోడ్‌ షో నిర్వహించారు.

AMILINENI: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
ప్రజలను ఓటు అభ్యర్థిస్తున్న అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 30: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళవారం శెట్టూరు మండలం చిన్నంపల్లి, బొచ్చుపల్లి, లింగదీర్లపల్లి, కైరేవు, చెర్లోపల్లి, మాలేపల్లి, ఎర్రబోరేపల్లి, కంబాలపల్లి, లక్ష్మంపల్లి గ్రామాల్లో అమిలినేని రోడ్‌ షో నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు ఆయా గ్రామాలలో పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో రైతులకు సాగునీరందించి ఆదుకుంటామన్నారు. తలారి రంగయ్య, ఉమామహేశ్వరనాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఎంపీగా ఏమీ చేయలేని రంగయ్య ఎమ్మెల్యేగా ఏంచేస్తాడని ఎద్దేవా చేశారు. కనీసం మున్సిపల్‌ చైర్మన సీట్లో కూర్చోనివ్వకుండా ఒక బీసీ నాయకుడిని మంత్రి అడ్డుకుంటే వాటిని కూడా రంగయ్య పరిష్కరించలేకపోయారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


దివ్యాంగుల ప్రచారం

కుందుర్పి: కూటమి విజయంతోనే దివ్యాంగుల సంక్షేమం సాధ్యమవుతుందని దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేష్‌ అన్నా రు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సురేంద్రబాబు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం తమ బాధ్యత అని అన్నారు. మర్రిస్వామి, శివానంద, మంజు, దివ్యాంగులు పాల్గొన్నారు.

రైతులకు రూ.20 వేలు పరిహారం: రైతులకు ఏటా రూ.20 వేలు పంటనష్టపరిహారం అందించనున్నట్లు అమిలినేని కుటుంబ సభ్యులు తెలిపారు. కుందుర్పి మండలం బెస్తరపల్లి, మహంతపురం, కదరంపల్లి గ్రామాల్లో మంగళవారం సురేంద్రబాబు సోదరి రాధామాధవి, కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. మే 13న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.


బ్రహ్మసముద్రంలో వైసీపీకి షాక్‌

బ్రహ్మసముద్రం: మండలం భైరసముద్రం, అజ్జయ్యదొడ్డి, తిప్పయ్యదొడ్డి గ్రామాలకు చెందిన వైసీపీలో కీలకనేతలు మంగళవారం టీడీపీలో చేరారు. బోయ లక్ష్మన్న, వార్డు మెంబర్లు నీరుగంటి పాతలింగ, కుంటిపాలప్పగారి యర్రిస్వామి, చాకలి రంగన్న, స్కూల్‌ కమిటీ చైర్మన గంగన్నతోపాటు 74 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. న్యాయవాదులు దేవేంద్ర, సుదర్శన, ముత్యాలప్ప, దిలీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పసుపు కండువాలు కప్పుకుని టీడీపీ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన వారందరికీ అమిలినేని సురేంద్రబాబు టీడీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా మండల సమీపంలోని తిప్పయ్యదొడ్డి గ్రామంలో కన్వీనర్‌ శ్రీరాములు ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ, వైసీపీ నాయకులు గొల్ల కెంచరప్పతోపాటు 15 యాదవ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 30 , 2024 | 11:37 PM