Share News

టిడ్కో గృహాల్లోకి కొండచిలువ

ABN , Publish Date - Nov 28 , 2024 | 05:07 AM

12 అడుగుల పొడవు... 30 కిలోలకు పైగా బరువున్న ఈ కొండచిలువ శ్రీకాకుళం జిల్లాలో కనిపించింది.

టిడ్కో గృహాల్లోకి కొండచిలువ

Andhrajyothy Desk : 12 అడుగుల పొడవు... 30 కిలోలకు పైగా బరువున్న ఈ కొండచిలువ శ్రీకాకుళం జిల్లాలో కనిపించింది. పలాస సమీపంలోని కోసంగిపురం జాతీయ రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహసముదాయంలో ఈ కొండచిలువ మంగళవారం రాత్రి కనిపించింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఈ భారీ కొండచిలువను చూసి భయంతో పరుగులు తీశారు. అక్కడి వారు వేసిన కేకలతో వ్యర్థనీరు వచ్చే సంపులోకి వెళ్లిన కొండచిలువ అందులో చిక్కుకుపోయింది. బుధవారం ఉదయం అటవీ అధికారులు, ఈస్ట్రన్‌ గాడ్స్‌ వైల్డ్‌లైఫ్‌ సభ్యుడు ఓంకార్‌ త్యాడీ అక్కడకు చేరుకుని దానిని బంధించి సమీప అడవిలో వదిలివేశారు.

- పలాస, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Nov 28 , 2024 | 05:09 AM