టీటీడీ చెన్నై సహకారంతో 1008 మంది చిన్నారులకు శ్రీవారి దర్శనం

ABN, First Publish Date - 2023-04-25T20:12:51+05:30 IST

రాజస్థాన్ యూత్ అసోసియేషన్, చెన్నై టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో అప్నబనాలో అనే కార్యక్రమం ద్వారా 1,008 మంది పిల్లలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

రాజస్థాన్ యూత్ అసోసియేషన్, చెన్నై టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో అప్నబనాలో అనే కార్యక్రమం ద్వారా 1,008 మంది పిల్లలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. చెన్నై ఫుడ్ బ్యాంక్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీటీడీ చెన్నై సహకారంతో 1,008 మంది పిల్లలను తిరుమలకు తీసుకెళ్తున్నారు. ఈ పిల్లల్లో అంధులు, వికలాంగులు, అనాధ ఆశ్రమాల నుంచి వచ్చిన చిన్నారులు ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. పిల్లలు తమ స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేసేలా ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. స్నేహితులతో కలిసి తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఓ చిన్నారి చెబుతోంది.

Updated at - 2023-04-25T20:18:28+05:30