రోడ్డెక్కిన టీసీఎస్ ఉద్యోగులు
ABN, First Publish Date - 2023-11-17T12:39:43+05:30 IST
టెక్ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారనే ఆరోపణలు భారీగా వినిపించాయి.
ABN Digital: టెక్ దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారనే ఆరోపణలు భారీగా వినిపించాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా బయటకు రావడంతో ఈ స్కాంలో సంబంధం ఉన్న 19 మంది ఉన్నతస్థాయి ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో వివాదం వెలుగులోకి వచ్చింది. టీసీఎస్ కంపెనీ ఉద్యోగుల విషయంలో అనైతికంగా వ్యవహరిస్తోందంటూ కేంద్ర కార్మిక శాఖకు ఐటీ వర్కర్స్ యూనియన్ నైట్స్ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా నోటీసులు ఇవ్వకుండా, సంప్రదింపులు లేకుండా 2వేల మంది ఉద్యోగులను బదిలీ చేసి.. వారికి వారి కుటుంబాలకు తీవ్ర వేదన మిగిల్చిందని నైట్స్ పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-17T12:39:45+05:30