రిలయన్స్‌లో భారీ ఎత్తున ఉద్యోగుల రాజీనామాలు

ABN, First Publish Date - 2023-08-11T12:25:15+05:30 IST

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలీకామ్ విభాగాలకు సంబంధించి 2022-23లో భారీ ఎత్తున ఉద్యోగులు స్వచ్చంధంగా రాజీనామాలు చేశారు.

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలీకామ్ విభాగాలకు సంబంధించి 2022-23లో భారీ ఎత్తున ఉద్యోగులు స్వచ్చంధంగా రాజీనామాలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జియోకు 41వేల మంది, రిలయన్స్ రిటైల్‌లో లక్ష కంటే ఎక్కువమంది ఉద్యోగులు రిజైన్ చేసినట్లు సమాచారం. రిలయన్స్ వార్షిక నివేదిక ప్రకారం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సంస్థలో అట్రిషియన్ రేటు 64.8 శాతం పెరిగింది. జియోలో 41వేల మందికి పైగా ఉద్యోగులు, రిలయన్స్ రిటైల్‌లో లక్షా 19 వేలకుపైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఏడాదిలోనే ఒక లక్షా, 67వేల 391 మంది ఉద్యోగులు వైతొలగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-11T12:25:15+05:30