Saina Nehwal: మేం పిల్లల్ని ఎప్పుడు కంటామంటే... బయటపెట్టిన సైనా నెహ్వాల్, కశ్యప్
ABN, First Publish Date - 2023-04-22T20:09:46+05:30 IST
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కొత్తగా కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని శనివారం ద్రోణాచార్య పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కొత్తగా కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని శనివారం ద్రోణాచార్య పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనానేహ్వాల్, పారుపల్లి కశ్యప్ దంపతులతోపాటు ప్రముఖులు హాజరయ్యారు. ఈ శిక్షణలో కేంద్రంలో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
సైనానేహ్వాల్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్మించిన పుల్లెల గోపీచంద్‌కు అభినందనలు తెలిపారు. బ్యాడ్మింటన్ ట్రాక్ అద్భుతంగా ఉందని, కోచ్‌లో ఏసీ కూడా ఏర్పాటు చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అకాడమీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. పారుపల్లి కశ్యప్ దంపతులు మాట్లాడుతూ ప్రస్తుతం గేమ్స్‌పైనే దృష్టిపెట్టామని, తాము పిల్లల్ని కనాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పారు. వచ్చే వారంలో ప్రారంభంకానున్న ఏషియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటున్నట్లు సైనా తెలిపారు.
Updated at - 2023-04-22T20:51:57+05:30