గుళ్లో నగల చోరీ.. 9 ఏళ్లకు తెచ్చిన దొంగ.. దేవుడి లీలేనా..!

ABN, First Publish Date - 2023-05-18T15:07:40+05:30 IST

దొంగలు (Thieves) రెచ్చిపోతున్నారు. బ్యాంకులు (Banks), ఏటీఎంలు (ATMs), ఇళ్లు (Houses), బస్సులు (Buses), సమూహ ప్రదేశాలు (Group Places).. ఇలా ఏ చోటును వాదలడంలేదు.

ఒడిశా: దొంగలు (Thieves) రెచ్చిపోతున్నారు. బ్యాంకులు (Banks), ఏటీఎంలు (ATMs), ఇళ్లు (Houses), బస్సులు (Buses), సమూహ ప్రదేశాలు (Group Places).. ఇలా ఏ చోటును వాదలడంలేదు. అవకాశం దొరికితే చాలు చేతి వాటం చూపిస్తున్నారు. ఏదైనా తప్పు చేస్తే ఎవరికీ చెప్పలేకపోయినా.. దేవుడికి చెప్పుకుని క్షమించు దేవుడా అని వేడుకుంటారు. కానీ ఆ దేవుడి నగలు కూడా దొంగలు కొట్టేస్తున్నారు. ఒడిశాలోని ఓ దొంగ రాధా కృష్ణుడి నగలను ఎత్తుకుపోయాడు. ఎవరికీ దొరకలేదు. ఎలా బుద్ది వచ్చిందో తెలియదు కానీ తప్పయిపోయిందంటూ తిరిగి 9 ఏళ్ల తర్వాత ఆ నగలను దేవుడి గుడిలోనే వదిలేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated at - 2023-05-18T15:07:40+05:30