మెడికల్ షాపుపై కోతుల అటాక్..

ABN, First Publish Date - 2023-05-22T13:58:33+05:30 IST

మంచిర్యాల జిల్లా: లక్‌శెట్టిపేట ప్రజలను కోతులు హడలెత్తిస్తున్నాయి. మండల కేంద్రంలో వానరాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

మంచిర్యాల జిల్లా: లక్‌శెట్టిపేట ప్రజలను కోతులు హడలెత్తిస్తున్నాయి. మండల కేంద్రంలో వానరాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల షాపులు, కిరాణా షాపుల్లో ప్రవేశించి దొరికిన వస్తువునల్లా ఎత్తుకెళుతున్నాయి. తాజాగా ఓ మెడికల్ షాపులో గుంపులుగా వచ్చిన కోతులు బీభత్సం సృష్టించాయి. షాపు అద్దాలనుధ్వంసం చేసి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కరిచేందుకు ప్రయత్నించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-22T13:58:33+05:30