ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చిన కోతి..

ABN, First Publish Date - 2023-10-16T12:14:07+05:30 IST

ఉత్తరప్రదేశ్: ఎవరైనా అతిగా అల్లరి చేస్తే కోతి చేష్టలు మానాలని కోపగించుకుంటాం. కానీ నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ కోతిని చూసి మాత్రం జనాలు తాము కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు. దాని తీరుకు ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరప్రదేశ్: ఎవరైనా అతిగా అల్లరి చేస్తే కోతి చేష్టలు మానాలని కోపగించుకుంటాం. కానీ నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ కోతిని చూసి మాత్రం జనాలు తాము కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు. దాని తీరుకు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలను తెలిసినవారికి పంపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ తహసీల్దార్ ఆఫీసులోకి కోతి ఇటీవలే అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడివారు దానిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ అంతలోనే కోతి ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న కొన్ని ఫైళ్ల వద్ద కూర్చొని వాటిని తిరగేయడం ప్రారంభించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-16T12:14:07+05:30