బాహుబలి స్టైల్లో వానరం ఫీట్లు..

ABN, First Publish Date - 2023-06-09T14:48:54+05:30 IST

భద్రాద్రి జిల్లా: ఓ వానరం బాహుబలి సినిమా స్టైల్లో ఫీట్లు చేసింది. ఒక మేకపై కూర్చున్న కోతి.. ఒక్కోక్క మేకపై దూకుతూ వెళ్లింది.

భద్రాద్రి జిల్లా: ఓ వానరం (Mokey) బాహుబలి సినిమా (Baahubali Movie) స్టైల్లో (Style) ఫీట్లు (Feets) చేసింది. ఒక మేకపై కూర్చున్న కోతి.. ఒక్కోక్క మేకపై దూకుతూ వెళ్లింది. భద్రాద్రి జిల్లా (Bhadradri Dist.), అశ్వరావుపేట మండలం, వంకవారిగూడెంలో ఈ ఘటన జరిగింది. రోజూ మేకల మంద వద్దకు వానరం వెళుతోంది. ముందు ఒక గొర్రెపై కూర్చుని.. మందపైకి దూకుతూ వెళ్లింది. అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది. వానరం చేసిన ఫీట్లు కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-10T23:31:10+05:30